హసన్‌పర్తి, నవంబర్ 14, (తెలంగాణ గళం):
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో బీఎం సందీప్‌ను నియమిస్తున్నట్లు అధిష్టానం స్పష్టం చేసింది. అయితే, ఉన్నట్టుండి ఇన్‌చార్జ్ మార్పునకు గల కారణాలను మాత్రం పార్టీ నాయకత్వం వెల్లడించలేదు.
బీఎం సందీప్ నేపథ్యం: కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీఎం సందీప్‌కు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమితులు కాకముందు, ఆయన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడ పార్టీ బలోపేతానికి పనిచేసిన అనుభవంతో ఇప్పుడు తెలంగాణ బాధ్యతలను అధిష్టానం ఆయనకు అప్పగించింది.
రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ-పార్టీ కార్యక్రమాల మధ్య సమన్వయం సాధించడంలో కొత్త ఇన్‌చార్జ్ కీలక పాత్ర పోషించనున్నారు. బీఎం సందీప్ నియామకంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
రిపోర్టర్ మోడెం సందీప్ .



