తెలంగాణ

సంగారెడ్డి: నూతనంగా ఎన్నికైన ఒగ్గు కళాకారులకు ఘన సన్మానం | ఒగ్గు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి: పెరుగు ఐలేష్ యాదవ్ డిమాండ్

సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఒగ్గు కళాకారుల సంఘం ప్రతినిధులను అఖిల భారత యాదవ మహాసభ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ​ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్, ప్…

By · · Updated

Share this article
సంగారెడ్డి: నూతనంగా ఎన్నికైన ఒగ్గు కళాకారులకు ఘన సన్మానం | ఒగ్గు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి: పెరుగు ఐలేష్ యాదవ్ డిమాండ్

సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఒగ్గు కళాకారుల సంఘం ప్రతినిధులను అఖిల భారత యాదవ మహాసభ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

​ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, మహిళా సంఘం అధ్యక్షురాలు మీన రాజు యాదవ్ గార్ల నేతృత్వంలో జరిగింది.

​ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన:

​మేకల శేఖర్ యాదవ్ (సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్)

​పెద్ద గొల్ల శ్రీశైలం యాదవ్ (సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి)

​ఏంబరి శ్రీశైలం యాదవ్ (పటాన్‌చెరు మండల ప్రెసిడెంట్)

​కుమార్ యాదవ్ (పటాన్‌చెరు మండల ప్రధాన కార్యదర్శి)

గార్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

​కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రాచీన జానపద కళ అయిన ఒగ్గు కథను బతికిస్తున్న కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు కళాకారులందరికీ ప్రత్యేక పెన్షన్లు, ఇళ్ల పంపిణీ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

​ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్, సంతోష్ లతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒగ్గు కళాకారులు, యాదవ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొpq0న్నారు.