తెలంగాణ

Untitled Draft

 బజార్ హత్నూర్,నవంబర్ 2,తెలంగాణ గళం    బజార్ హత్నూర్ మండలం సోనేరావ్ గూడా గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏళ్లుగా రోడ్డు వేయకపోవడంతో ఇప్పటికీ మట్టి రోడ్డుగానే ఉంది…

By · · Updated

Share this article
Untitled Draft

 బజార్ హత్నూర్,నవంబర్ 2,తెలంగాణ గళం 

 

బజార్ హత్నూర్ మండలం సోనేరావ్ గూడా గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏళ్లుగా రోడ్డు వేయకపోవడంతో ఇప్పటికీ మట్టి రోడ్డుగానే ఉంది.మధ్యలో ఎటు చూసినా గుంతలు, దుమ్ము, చెత్తాచెదారంతో నిండి ఉంది. వర్షం వస్తే ఈ రోడ్డు పూర్తిగా బురదమయమై వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి.దీనివల్ల రైతులు విద్యార్థులు స్కూల్ కు వెళ్లడానికి, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయంపై సర్పంచ్ దేవురావ్ మాట్లాడుతూ.. "సోనేరావ్ గూడా రోడ్డు సమస్య చాలా ఏళ్లుగా ఉంది. పై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ రోడ్డును మంజూరు చేసి సీసీ రోడ్డు లేదా తారు రోడ్డు వేయాలని కోరుతున్నాం అని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నరు.

Tags: