అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి – ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి
పరకాల తెలంగాణ గళం:నవంబర్ 01
పట్టభద్రుల ఓటరు నమోదును సులభతరం చేసేందుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా రెండు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
పరకాల పట్టణం, పరకాల మండలం, నడికూడ మండలాలకు చెందిన అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు ఈ హెల్ప్‌డెస్క్‌ల ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు 2026 నవంబర్ 6 చివరి తేదీ కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఓటరు నమోదు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ ఓటరు నమోదు కార్యక్రమంలో పరకాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మడి కృష్ణకాంత్, అల్లం శ్రీరామ్, పరకాల టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం శివకుమార్, క్లస్టర్ ఇన్‌చార్జి, సిస్టమ్ ఆపరేటర్లు అల్లం శ్రీరామ్, ఇనుముల రామLS�



