తెలంగాణ

పరకాలలో ఘనంగా నెహ్రూ జయంతి.. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

పరకాల, తెలంగాణ గళం, నవంబర్ 14: పరకాల:భారత తొలి ప్రధాని, దేశ నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పరకాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో  ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని క్యాంపు కా…

By · · Updated

Share this article
పరకాలలో ఘనంగా నెహ్రూ జయంతి.. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

పరకాల, తెలంగాణ గళం, నవంబర్ 14:

పరకాల:భారత తొలి ప్రధాని, దేశ నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పరకాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో  ఘనంగా నివాళులు అర్పించారు.

పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నెహ్రూ చిత్రపటానికి పట్టణ అధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నెహ్రూ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో, విద్యా వ్యాప్తిలో నెహ్రూ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. చిన్నారుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి వల్లే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నెహ్రూ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సమన్వయ కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, బీఎల్ఏలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: