తెలంగాణ

పరకాల ప్రీమియర్ లీగ్‌ – 2026కు సర్వం సిద్ధం.. విజేతల కప్పులను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పోచంపల్లి!

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలి.. గ్రామీణ క్రీడా ప్రతిభకు లీగ్‌లు వేదిక కావాలి పరకాల తెలంగాణ గళం నవంబర్ 09  పట్టణంలో త్వరలో ప్రారంభం కానున్న పరకాల ప్రీమియర్ లీగ్‌ – 2026 స…

By · · Updated

Share this article
పరకాల ప్రీమియర్ లీగ్‌ – 2026కు సర్వం సిద్ధం.. విజేతల కప్పులను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పోచంపల్లి!

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలి.. గ్రామీణ క్రీడా ప్రతిభకు లీగ్‌లు వేదిక కావాలి

పరకాల తెలంగాణ గళం నవంబర్ 09 

పట్టణంలో త్వరలో ప్రారంభం కానున్న పరకాల ప్రీమియర్ లీగ్‌ – 2026 సీజన్‌-1 క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన విజేతల కప్పులను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు. 

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి క్రికెట్ లీగ్‌లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.

టోర్నమెంట్ నిర్వహణకు ముందుకు వచ్చిన మేనేజ్‌మెంట్ సభ్యులను అభినందించిన ఆయన.. విజేతలకు అందజేయనున్న కప్పులను ఆవిష్కరించి, టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ మేనేజ్‌మెంట్ సభ్యులు రాజేష్, చిన్నుతో పాటు పలువురు క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.

Tags: