రాంలీలా మైదానంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు చోరీ వ్యతిరేక పోరాటానికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు
పరకాల తెలంగాణ గళం :
నవంబర్ 01
ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, భారత రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'ఓటు చోరీ' వ్యతిరేక పోరాటానికి పరకాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి బయలుదేరారు.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని ఓటు చోరీ ఆరోపణలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యత, భారత రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై తన గళాన్ని వినిపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది.
దేశ ప్రజల ఓటు హక్కును, రాజ్LS�



