తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ) : పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన నిరుపేద మహిళ బీర్ల మౌనిక
కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని, సొంత ఇల్లు లేని విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి మౌనిక కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు.
.మంజూరైన ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి గురువారం రాములపల్లి గ్రామంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, ఎంపీడీవో ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథులుగా హాజరుకాగా, పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారి తిరుపతి ముగ్గు పోసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా కడారి తిరుపతి మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మౌనిక కుటుంబ పరిస్థితిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించి ఇల్లు మంజూరు చేయించడం పేద కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు బండారి శ్రీనివాస్, రమేష్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చెట్ల కిషన్, చాట్ల విజయభాస్కర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.


