తెలంగాణ

నేరెళ్లలో విద్యుత్ సమస్యకు పరిష్కారం..నూతన స్తంభాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ బాలగౌడ్

ప్రజా సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ బాలగౌడ్ తెలంగాణ గళం, జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): నేరెళ్ల గ్రామంలోని జంబి గద్దె నుంచి కాసరపు రామస్వామి ఇంటి వరకు విద్యుత్ సర్వీస్ వైర్ల…

By · · Updated

Share this article

ప్రజా సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ బాలగౌడ్

తెలంగాణ గళం, జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): నేరెళ్ల గ్రామంలోని జంబి గద్దె నుంచి కాసరపు రామస్వామి ఇంటి వరకు విద్యుత్ సర్వీస్ వైర్లు దూరంగా ఉండటంతో ఎదురవుతున్న సమస్యను సర్పంచ్ కాసరపు బాలగౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. సమస్య పరిష్కారానికి సంబంధిత ప్రాంతంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు.

విద్యుత్ వైర్లు దూరంగా వేలాడటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్యలు చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్ బాలగౌడ్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొదటి వార్డు సభ్యుడు పాదం శంకర్, విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్‌మెన్ రమేష్, మొదటి వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags: