జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్
జ్యోతి లక్ష్మణ్ నియామకంపై కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం
తెలంగాణ గళం, జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):
జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నియామకంతో జిల్లాలో మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తానని పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారం, వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు.


