శివ్వంపేట, నవంబర్ 1 (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామ శివారులో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై ఉన్న స్వామివారిని కాలి నడకన చేరుకొని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకుంటూ ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు, తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దిగువ ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. వ్రత మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయం పక్కనే ఉన్న గుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల వద్ద తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ధనుంజయ శర్మ, ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు.
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
శివ్వంపేట, నవంబర్ 1 (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామ శివారులో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మెదక్ జిల్లాలోని వివి…
By తెలంగాణ గళం · · Updated
Share this article



