
కేటీఆర్‌ను కలిసిన జగిత్యాల తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్
తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కొద్దిసేపు మాట్లాడారు.
అనంతరం జగిత్యాల నియోజకవర్గంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాల గురించి కేటీఆర్‌తో చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, స్థానిక రాజకీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా దీపావళి పండుగ శుభాకాంక్షలతో పాటు జగిత్యాల నియోజకవర్గ రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.


