తెలంగాణ గళం, జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్) :
తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్గా జువ్వాడి నర్సింగ్ రావు ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్లోని హకీంపేట జూపల్లి బాలమ్మ వెలమ కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జువ్వాడి నర్సింగ్ రావును ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్యతో కలిసి అడువాల జ్యోతి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో వెలమ సామాజిక వర్గ అభివృద్ధికి మరింత కృషి జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, జగిత్యాల ఆర్టీఏ సభ్యులు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ వీరబత్తిని శ్రీనివాస్, రేపెల్లి హరికృష్ణ, మీరే కాసిం అలీ, మొయిజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


