తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లకు పేదరికమే కొలమానం

నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి వేడుకలు.. ఆరుగురు దివ్యాంగులకు స్కూటీల పంపిణీ తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్…

By · · Updated

Share this article

నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి వేడుకలు.. ఆరుగురు దివ్యాంగులకు స్కూటీల పంపిణీ

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పేదరికమే ప్రధాన కొలమానమని, రానున్న రోజుల్లో మంజూరు చేసే ఇళ్లకు కూడా ఇదే ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాల్లో భాగంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో 

నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఎనగందుల శంకరమ్మ, లక్ష్మయ్య దంపతుల ఇంటి వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొని, అనంతరం ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేరుతున్న తరుణంలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద వారితో కలిసి దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఇల్లు నిర్మించుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక చాలామంది నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.

ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామని, త్వరలో మరో 2 వేల ఇళ్లకు అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించి వారి సొంతింటి కలను నెరవేరుస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Tags: