తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ) : జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో కాసరపు అజయ్ గౌడ్, లిఖిత దంపతుల కుమార్తె కాసరపు హాసిని సారీ ఫంక్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై చిన్నారి హాసినిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హాసిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు పాల్గొన్నారు.



