పరకాల తెలంగాణ గళం నవంబర్ 08
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



