గూడూరు,నవంబర్ 2 (తెలంగాణ గళం) : గూడూరులో ఆదివాసిల పోరాటయోధుడు గోండు బొబ్బిలి కొమరం భీమ్ 86వ వర్ధంతిని గూడూరులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసి ఉద్యోగుల రాష్ట్ర నాయకులు ఐలబోయిన వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం, ఆదివాసీల హక్కుల కోసం, జల్ -జంగల్ -జమీన్ అనే నినాదంతో పుట్టిన గోండు బొబ్బిలి కొమరం భీముడు అని అన్నారు. ఆదివాసి ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ 1901 అక్టోబర్ 22 అసిఫాబాద్ జిల్లాలో సంకేపల్లి గ్రామంలో పుట్టిన ఆదివాసి బిడ్డ కొమరం భీమ్ అడవి బిడ్డల కోసం జల్ జంగల్ జమీన్ (నీరు అడవి, భూమి) అనే ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చారు. అడవి పై ఆదివాసులకే సర్వహక్కులు ఉండాలని అటవీశాఖ అధికారుల వేధింపులకు జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానీయుడు కొమరం భీముడు అని అన్నారు.నిజాం నవాబు సైన్యానికి మరియు స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా కొమురం భీమ్ ఎన్నో గెరిల్లా పోరాటాలు చేశారాని అన్నారు.1940 అక్టోబర్ మాసంలో జోడేఘాట్ అడవుల్లో నిజాం బలగాల చేతుల్లో కొమరం భీముడు వీరమరణం పొందారాని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగులు పూణేం సమ్మయ్య,దారం స్వామి, ఈసం సురేందర్ రావు, కుంజ సురేందర్, మోకాళ్ళ వెంకన్న, అల్లెం యశోద,ఈక శ్రీలత,మంజుల,లక్ష్మి, అమృత, ఆదివాసి యువకులు చాపల శ్రీపత్, సందీప్, పృథ్వీరాజ్, జగదీశ్వర్, సాయి,అలాగే ఆదివాసి సంఘ నాయకులు పొడుగు రామారావు, ఈసం రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కొమరం భీమ్ 86వ వర్ధంతి.
గూడూరు,నవంబర్ 2 (తెలంగాణ గళం) : గూడూరులో ఆదివాసిల పోరాటయోధుడు గోండు బొబ్బిలి కొమరం భీమ్ 86వ వర్ధంతిని గూడూరులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసి ఉద్యోగుల రాష్ట్ర నాయక…
By తెలంగాణ గళం · · Updated
Share this article



