మెదక్ జిల్లా శివ్వంపేట, (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగయ్యపల్లి గ్రామంలో గోపాలమిత్ర ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని పశువులు, గొర్రెలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు, మందులు అందించారు.శిబిరంలో భాగంగా ఐదు పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించగా, 26 పశువులకు పీడీల పరీక్షలు చేపట్టారు. అదేవిధంగా 18 దూడలకు నట్టల నివారణ మందులు అందించారు. 200 గొర్రెలకు డీవార్మింగ్ (నట్టల నివారణ) మందులు పంపిణీ చేసి చికిత్స అందించారు.పశువుల ఆరోగ్య పరిరక్షణ, పాడి రైతులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పశువులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు వ్యాధుల నివారణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్యురాలు డాక్టర్ పర్వీన్ బేగం, సూపర్‌వైజర్ సత్యనారాయణ, గోపాలమిత్ర గణేష్, జేఈఓ రమాదేవి, ఓఎస్ వెంకటేష్‌తో ఉప సర్పంచ్ పవన్ గుప్తా రైతులు పాల్గొన్నారు.
గంగయ్యపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం
మెదక్ జిల్లా శివ్వంపేట, (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగయ్యపల్లి గ్రామంలో గోపాలమిత్ర ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని పశువులు, గొర్రెలకు వివిధ రకాల…
By తెలంగాణ గళం · · Updated
Share this article



