తెలంగాణ

ఎడమల భోజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

25 మంది రక్తదానం..పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): గొల్లపల్లి మండలం శంకర్రావుపేట గ్రామానికి చెందిన ఎడమల భోజేందర్ రెడ్డి జన్మదినం సందర…

By · · Updated

Share this article

25 మంది రక్తదానం..పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): గొల్లపల్లి మండలం శంకర్రావుపేట గ్రామానికి చెందిన ఎడమల భోజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం రోజున యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 25 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఎడమల భోజేందర్ రెడ్డి మాట్లాడుతూ..తన జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. రక్తదానం మహాదానమని, పుట్టినరోజులను హంగూ ఆర్భాటాలకు పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.

అనంతరం మల్లన్నపేట, శంకర్రావుపేట, వెంగలపూర్, శ్రీరాములపల్లి గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు గోలి గంగారెడ్డి, సిద్ధెంకి మల్లారెడ్డి, రాంరెడ్డి, సల్లూరి శోభన్, ఉప సర్పంచులు రంజిత్ రెడ్డి, తిరుపతి,నాయకులు అవారి చందు, గుర్రం మల్లారెడ్డి, కిషోర్ రెడ్డి, గోలి శశి, సరసని హన్మారెడ్డి, గాజుల మల్లారెడ్డి, ఉల్లెంగుల మొగిలి, లవన్, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.

Tags: