గాజంగి నందయ్యను సత్కరించిన అడువాల జ్యోతి లక్ష్మణ్
తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు గాజంగి నందయ్యను జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మహిళా కాంగ్రెస్ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తామని అడువాల జ్యోతి లక్ష్మణ్ తెలిపారు.


