స్పోర్ట్స్

పర్వతారోహణ అనుభవంతో ఉత్సాహంగా శాతవాహన NSS బృందం

ధర్మశాల కొండల్లో సహజ రాక్ క్లైంబింగ్‌లో సత్తా చాటిన శాతవాహన NSS బృందం తెలంగాణ గళం - కరీంనగర్ఆర్.సి. ప్రభాకర్ సహజ పర్వతారోహణలో విద్యార్థుల ప్రతిభకు నిర్వాహకుల ప్రశంసలు కరీంనగర్: హిమాచల్ ప్రదేశ్‌లోన…

By · · Updated

Share this article

ధర్మశాల కొండల్లో సహజ రాక్ క్లైంబింగ్‌లో సత్తా చాటిన శాతవాహన NSS బృందం

తెలంగాణ గళం - కరీంనగర్
ఆర్.సి. ప్రభాకర్

సహజ పర్వతారోహణలో విద్యార్థుల ప్రతిభకు నిర్వాహకుల ప్రశంసలు

కరీంనగర్: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల అడ్వెంచర్ క్యాంపులో శాతవాహన యూనివర్సిటీ NSS విద్యార్థులు మరో సాహస కార్యక్రమంలో పాల్గొన్నారు. శిబిరంలో భాగంగా నిర్వహించిన సహజ రాక్ క్లైంబింగ్‌లో డాక్టర్ కాంపెల్లి అర్జున్ వాలంటీర్లతో కలిసి పాల్గొని ప్రోత్సహించారు.

సుమారు 1500 అడుగుల ఎత్తులోని సహజ పర్వత ప్రాంతాల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. గత రోజు పొందిన కృత్రిమ పర్వతారోహణ శిక్షణ ఈ కార్యక్రమంలో తోడ్పడిందని తెలిపారు. ఈ అనుభవం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, సమన్వయ భావనను పెంపొందించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags: