కరీంనగర్ / ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంపులో శాతవాహన విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ (NSS) వాలంటీర్లు తమ ప్రతిభను చాటుతున్నారు. క్యాంపులో రెండో రోజు నిర్వహించిన కృత్రిమ పర్వతారోహణ (ఆర్టిఫిషియల్ రాక్ క్లైంబింగ్) శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సాహస నైపుణ్యాలను ప్రదర్శించారు.
కంటింజెంట్ లీడర్ డాక్టర్ కె. అర్జున్ ఆధ్వర్యంలో అద్వైత్, అజయ్, శ్రీకాంత్, సంతోష్, ఓం ప్రకాష్, అనిత, మనీషా, దివ్య, నందిని, తేజశ్రీ తదితర వాలంటీర్లు రాక్ క్లైంబింగ్‌లో పాల్గొని ఆకట్టుకున్నారు.
ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో భయాన్ని అధిగమించే ధైర్యం, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెంపొందుతాయని శిక్షకులు వివరించారు. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి వంటి నైపుణ్యాలు అలవడతాయని పేర్కొన్నారు.
కంటింజెంట్ లీడర్ డాక్టర్ కె. అర్జున్ సైతం వాలంటీర్లతో కలిసి రాక్ క్లైంబింగ్‌లో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. జాతీయ స్థాయి క్యాంపులో శాతవాహన విశ్వవిద్యాలయ విద్యార్థులు కనబరుస్తున్న ప్రతిభ, క్రమశిక్షణను నిర్వాహకులు అభినందించా
రు.

