శివ్వంపేట, నవంబర్ 1 (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామ పరిధిలోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో భాను సప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార ఆంజనేయ స్వామి హృదయంపై సూర్యభగవానుడు దర్శనమివ్వడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు రాజ ప్రభు శర్మ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈవో సార శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రుల దేవదత్త శర్మ, ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ, దేవి శ్రీ శర్మ, ఆలయ సిబ్బంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భాను సప్తమి సందర్భంగా చాకరిమెట్ల ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
శివ్వంపేట, నవంబర్ 1 (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామ పరిధిలోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో భాను సప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించ…
By తెలంగాణ గళం · · Updated
Share this article



