తెలంగాణ

ఆర్టీసీ బస్సులకు సరికొత్త భద్రతా నియమాలు:

డోర్లు క్లోజ్ చేశాకే ముందుకు కదలాలి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులతో పాటు తమ సిబ్బంది సురక్షిత ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ ఆధ్…

By · · Updated

Share this article
ఆర్టీసీ బస్సులకు సరికొత్త భద్రతా నియమాలు:

డోర్లు క్లోజ్ చేశాకే ముందుకు కదలాలి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులతో పాటు తమ సిబ్బంది సురక్షిత ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే అన్ని రకాల బస్సులకు తప్పనిసరిగా డోర్లు ఏర్పాటు చేయాలని, వాటిని పూర్తిగా మూసివేసిన (క్లోజ్ చేసిన) తర్వాతే బస్సులు ముందుకు కదలాలని సంస్థ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల మణుగూరు డిపోకు చెందిన ఒక మహిళా కండక్టర్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన దురదృష్టకర సంఘటన నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి, ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతను పటిష్టం చేయడానికి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం డోర్లు లేని బస్సులన్నింటినీ తక్షణమే గుర్తించి, వాటికి కొత్తగా డోర్లను అమర్చాలని డిపో అధికారులకు ఆదేశాలు అందాయి.