మెదక్ జిల్లా శివ్వంపేట, (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఆరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మండలంలోని పిల్లుట్ల, ఏదుల్లాపూర్, గుండ్లపల్లి, తిమ్మాపూర్, చిన్నగొట్టిముక్కుల, చెన్నాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనితెలిపారు.మండలంలోని ఆరు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో ఆయా గ్రామాలతో పాటు సమీప గ్రామాల రైతులకు కూడా ధాన్యం విక్రయించేందుకు సౌకర్యం కలగనుంది. రైతులకు రవాణా ఇబ్బందులు తగ్గడంతో పాటు కొనుగోలు ప్రక్రియ సులభతరం కానుంది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శివ్వంపేట మండల అధ్యక్షుడు రాజా రమణ గౌడ్, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, శివ్వంపేట మండల తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
మెదక్ జిల్లా శివ్వంపేట, (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఆరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మండలంలోని…
By తెలంగాణ గళం · · Updated
Share this article



