తెలంగాణ

22వ వార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలు.. డ్రైనేజీలో నిలిచిన మురుగునీరు!

దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరవుతున్న స్థానికులు.. దోమల బెడదతో వ్యాధుల భయం పరకాల, తెలంగాణ గళం,  నవంబర్ 3: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు పద్మశాలి వీధి, ముదిరాజ్ వాడ లో పారిశుధ్య సమస్యలు స్థానిక…

By · · Updated

Share this article
22వ వార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలు.. డ్రైనేజీలో నిలిచిన మురుగునీరు!

దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరవుతున్న స్థానికులు.. దోమల బెడదతో వ్యాధుల భయం

పరకాల, తెలంగాణ గళం,  నవంబర్ 3:

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు పద్మశాలి వీధి, ముదిరాజ్ వాడ లో పారిశుధ్య సమస్యలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వార్డులోని పలు ప్రాంతాల్లో రోడ్ల పక్కనే చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. 

రోజుల తరబడి చెత్త తొలగించకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతూ స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు వార్డులోని డ్రైనేజీ కాల్వలు చెత్తాచెదారంతో పూడుకుపోవడంతో మురుగునీరు ముందుకు వెళ్లకుండా నిలిచిపోతోంది.

నిల్వ ఉన్న మురుగునీటితో దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చిన్నారులు, వృద్ధులు ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.

పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, వెంటనే చెత్త కుప్పలను తొలగించి డ్రైనేజీ కాల్వలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. 

సమస్యలు పునరావృతం కాకుండా ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేపట్టి 22వ వార్డులో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags: