హనుమకొండ జిల్లా, వడ్డేపల్లి , తెలంగాణ గళం
నవంబర్ 22
క్లీన్‌అప్ తెలంగాణ మరియు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లోని వడ్డేపల్లి చెరువు వద్ద పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో CJP వరంగల్ వాలంటీర్లు తరుణ్, హసన్‌తో పాటు క్లీన్‌అప్ తెలంగాణ మహమ్మద్ గౌస్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు.
పర్యావరణ పరిరక్షణ, చెరువుల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సామాజిక బాధ్యతలో యువతను భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని చెప్పారు.



