*తితిదే పాలకమండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!*
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి పదవీకాలం ముగియడంతో, నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు దేవస్థానం పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన *ప్రత్యేక అధికారుల కమిటీ (Specified Authority)* ను ప్రభుత్వం నియమించింది.
*ప్రత్యేక అధికారుల కమిటీ వివరాలు:*
▪️శ్రీ ముద్దాడ రవిచంద్ర, IAS – తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో – కమిటీ ఛైర్మన్.
▪️శ్రీ వి. వినయ్ చంద్, IAS – ప్రభుత్వ కార్యదర్శి, ఆర్థిక శాఖ – సభ్యుడు.
▪️శ్రీ కె. కన్నబాబు, IAS – ప్రభుత్వ కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ (FAC) – సభ్యుడు.
▪️ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం ఈ ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది.
▪️ఈ కమిటీ TTD పాలకమండలికి ఉండే అన్ని అధికారాలను వినియోగించడంతో పాటు, పాలకమండలి నిర్వహించాల్సిన అన్ని విధులను నిర్వహిస్తుంది.
▪️పదవీకాలం: ఈ ప్రత్యేక అధికారుల కమిటీ ఒక సంవత్సరం పాటు లేదా నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు ఉంటుంది.