సీఎం సహాయనిధితో పేదలకు భరోసా: కడారి తిరుపతి
తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):

సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారి తిరుపతి అన్నారు. పెగడపల్లి మండలంలోని బతికేపల్లి, శాలపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం పొందేందుకు చేసిన ఖర్చులో ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. ఈ పథకం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ముంజ మహేశ్వరి, మధుకర్ గౌడ్, కాపరవేణి చామంతి, నవీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్ల విజయ్ భాస్కర్, బాలుసాని శ్రీనివాస్ గౌడ్, మన్నె గంగరాజం, అడపా తిరుపతి, ఉపసర్పంచ్ నారాయణ, పంచాయతీ కార్యదర్శులు నిఖిల్ రెడ్డి, శ్రీవాణి, వార్డు సభ్యులు వెంకటరమణ, నాయకులు కృష్ణహరి, సంధి మల్లారెడ్డి, లచ్చ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


