తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గీత కార్మికుల పాలాభిషేకం

- గీత కార్మికులకు పింఛన్ల మంజూరుపై హర్షం.  - ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్‌కు కృతజ్ఞతలు. హసన్‌పర్తి/చింతగట్టు,నవంబర్ 19,(తెలంగాణ గళం). రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ఆసరా (చేయూత)' సామాజిక భద…

By · · Updated

Share this article
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గీత కార్మికుల పాలాభిషేకం

- గీత కార్మికులకు పింఛన్ల మంజూరుపై హర్షం. 

- ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్‌కు కృతజ్ఞతలు.

హసన్‌పర్తి/చింతగట్టు,నవంబర్ 19,(తెలంగాణ గళం).

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ఆసరా (చేయూత)' సామాజిక భద్రతా పింఛన్ల పథకంలో భాగంగా కల్లు గీత కార్మికులకు నూతనంగా పెన్షన్లు మంజూరు చేయడం పట్ల చింతగట్టు గీత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ చింతగట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శ్రమజీవులైన కల్లు గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గీత కార్మికులకు అండగా నిలిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారికి గీత కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చింతగట్టు గౌడ సంఘం అధ్యక్షుడు జనగాని సురేష్, ఉపాధ్యక్షుడు చింత ప్రణీత్ కుమార్, కార్యదర్శి ముంజ శ్రీకాంత్, గౌడ సంఘం కార్యవర్గ సభ్యులు, కల్లు గీత కార్మికులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

(రిపోర్టర్:మోడెం సందీప్)