తెలంగాణ

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. నడికూడలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

  సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో రైతులకు ఆర్థిక భరోసా – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి   పరకాల తెలంగాణ గళం నవంబర్ 19   రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన…

By · · Updated

Share this article
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. నడికూడలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో రైతులకు ఆర్థిక భరోసా – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

 

పరకాల తెలంగాణ గళం నవంబర్ 19

 

రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం నడికూడ మండల కేంద్రంలో పీఏసీఎస్ మాదారం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా మరియు సజావుగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తూ రైతులకు అదనపు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. 

 

రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

Tags: