తెలంగాణ

రాఘవపట్నం గ్రామ అభివృద్ధికి స్థలాలు కేటాయించాలి

గ్రామ ప్రజల అవసరాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన కాసారపు భవాని అరవింద్ గౌడ్ తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): గొల్లపల్లి మండలం రాఘవ…

By · · Updated

Share this article

గ్రామ ప్రజల అవసరాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలి

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన కాసారపు భవాని అరవింద్ గౌడ్

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):

గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని కోరుతూ గ్రామ ప్రజల తరఫున గొల్లపల్లి మండల తహసీల్దార్‌ ఎండి అబ్దుల్ మజీద్ కు వినతిపత్రం అందజేశారు.

గ్రామ యువత క్రీడలు ఆడేందుకు అనువైన ఆటస్థలం, రైతులకు ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు కలగకుండా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు స్థలం, మహిళా సంఘాల సమావేశాలు, కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరారు.

ఈ మూడు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగిన స్థలాలు కేటాయించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని తహసీల్దార్‌ను విజ్ఞప్తి చేశారు.

కాసారపు భవాని అరవింద్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Tags: