తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో బుద్ధ విగ్రహావిష్కరణ.. ఆలయాల అభివృద్ధికి సహకరిస్తా: ఎమ్మెల్యే రేవూరి

  కంఠాత్మకూరులో విద్యార్థులకు దిశానిర్దేశం.. పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు   పరకాల తెలంగాణ గళం నవంబర్ 19   హనుమకొండ జిల్లా కంఠాత్మకూరు గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఏ…

By · · Updated

Share this article
ప్రభుత్వ పాఠశాలలో బుద్ధ విగ్రహావిష్కరణ.. ఆలయాల అభివృద్ధికి సహకరిస్తా: ఎమ్మెల్యే రేవూరి

 

కంఠాత్మకూరులో విద్యార్థులకు దిశానిర్దేశం.. పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

 

పరకాల తెలంగాణ గళం నవంబర్ 19

 

హనుమకొండ జిల్లా కంఠాత్మకూరు గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

 

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

అనంతరం గ్రామంలోని పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చారు.

Tags: