తెలంగాణ

ఫోటోగ్రాఫర్ విజయ్ కుటుంబానికి అండగా నిలిచిన అసోసియేషన్.. ఆర్థిక సాయం అందజేత

ఫోటోగ్రాఫర్ విజయ్ కుటుంబానికి అండగా నిలిచిన అసోసియేషన్.. ఆర్థిక సాయం అందజేత పరకాల తెలంగాణ గళం నవంబర్ 18 పరకాల పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు పెంబర్తి విజయ్ తండ్రి పెంబర్తి మొగి…

By · · Updated

Share this article
ఫోటోగ్రాఫర్ విజయ్ కుటుంబానికి అండగా నిలిచిన అసోసియేషన్.. ఆర్థిక సాయం అందజేత

ఫోటోగ్రాఫర్ విజయ్ కుటుంబానికి అండగా నిలిచిన అసోసియేషన్.. ఆర్థిక సాయం అందజేత

పరకాల తెలంగాణ గళం నవంబర్ 18

పరకాల పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు పెంబర్తి విజయ్ తండ్రి పెంబర్తి మొగిలి మృతి పట్ల అసోసియేషన్ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మొగిలి స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

అనంతరం అసోసియేషన్ తరఫున కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి తమ సంఘీభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. పెంబర్తి మొగిలి మృతి ఆ కుటుంబానికి తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. బాధిత కుటుంబానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

Tags: