తెలంగాణ

పేద కుటుంబాలకు భరోసా, బజార్‌హత్నూర్‌లో పెన్షన్ పత్రాల పంపిణీ చేసిన సుదర్శన్ రెడ్డి

బజార్‌హత్నూర్, నవంబర్ 21,తెలంగాణ గళంఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో గురువారం కొత్త  పెన్షన్ ల పంపిణి కారిక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే అనిల…

By · · Updated

Share this article
పేద కుటుంబాలకు భరోసా,  బజార్‌హత్నూర్‌లో పెన్షన్ పత్రాల పంపిణీ చేసిన సుదర్శన్ రెడ్డి

బజార్‌హత్నూర్, నవంబర్ 21,తెలంగాణ గళం


ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో గురువారం కొత్త  పెన్షన్ ల పంపిణి కారిక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు ఎంతో భరోసా ఇస్తాయని, ఎవరూ అర్హత ఉండి పథకానికి దూరం కాకూడదని అన్నారు.
ఇందిరమ్మ బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు భద్రత కలుగుతుందని, కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా బీమా ఆదుకుంటుందని తెలిపారు. అర్హులైన వారందరూ ఈ పథకంలో చేరాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, బోథ్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలును మరింత వేగవంతం చేస్తామని అన్నారు. గ్రామాల్లో ఇంకా పెన్షన్, బీమా రాని వారు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా సర్వే చేసి గుర్తిస్తున్నామని, పత్రాలు సక్రమంగా ఉంటే వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకుందని, ఇక నెలనెలా పెన్షన్ వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: