తెలంగాణ

పరకాల పూర్వ వైభవం ఎక్కడ? అభివృద్ధిపై పాలకులకు ప్రశ్న.!

పరకాల, తెలంగాణ గళం నవంబర్ 19: పరకాల: ఒకప్పుడు ఏడు మండలాలకు కేంద్రబిందువుగా, వాణిజ్యానికి చిరునామాగా వెలిగిన పరకాల నేడు అభివృద్ధిలో వెనుకబడటం బాధాకరమని పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్…

By · · Updated

Share this article
పరకాల పూర్వ వైభవం ఎక్కడ? అభివృద్ధిపై పాలకులకు ప్రశ్న.!

పరకాల, తెలంగాణ గళం నవంబర్ 19:

పరకాల: ఒకప్పుడు ఏడు మండలాలకు కేంద్రబిందువుగా, వాణిజ్యానికి చిరునామాగా వెలిగిన పరకాల నేడు అభివృద్ధిలో వెనుకబడటం బాధాకరమని పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

దామెర, ఆత్మకూరు, శాయంపేట, రేగొండ, మొగుళ్లపల్లి, కమలాపూర్, భూపాలపల్లి, కాటారం తదితర ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయం, ఎరువులు, కిరాణా, వస్త్రాలు, వివాహాది కొనుగోళ్లకు పరకాల ప్రధాన కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. ప్రతిరోజూ వేలాదిమంది వచ్చి వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారని, నేడు ఆ వైభవం కోల్పోతున్నదన్నారు.

పారిశ్రామిక అభివృద్ధి, మెరుగైన రహదారులు, ఆధునిక మార్కెట్, నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు, యువతకు ఉపాధి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. భౌగోళికంగా, వాణిజ్యపరంగా ప్రాధాన్యత ఉన్న పరకాలకు జిల్లా హోదా ఎందుకు దక్కలేదో ప్రజలకు వివరించాలన్నారు.

రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారవేత్తలు కలిసి పరకాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు, అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Tags: