తెలంగాణ

పరకాల పహాల్ ఫైనాన్స్‌లో రూ.5.20 లక్షల నిధుల గోల్‌మాల్!

ఉద్యోగిపై పోలీసులకు కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు పరకాల ,తెలంగాణ గళం,నవంబర్ 24: పట్టణంలోని ఆకుల వార్డులో ఉన్న పహాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో నగదు దుర్వినియోగం వ్యవహారం వెలుగులోకి…

By · · Updated

Share this article
పరకాల పహాల్ ఫైనాన్స్‌లో రూ.5.20 లక్షల నిధుల గోల్‌మాల్!

ఉద్యోగిపై పోలీసులకు కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు

పరకాల ,తెలంగాణ గళం,నవంబర్ 24:

పట్టణంలోని ఆకుల వార్డులో ఉన్న పహాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో నగదు దుర్వినియోగం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంస్థలో గత రెండేళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ మార్త  నరేష్ కుమార్ అనే ఉద్యోగి రూ.5 లక్షల 20 వేల నగదును సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నట్లు కంపెనీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

సంస్థకు చెందిన వసూళ్లు, ఖాతాదారుల నుంచి సేకరించిన నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆడిట్‌లో వెల్లడైనట్లు తెలిసింది. ఈ మేరకు కంపెనీ యాజమాన్యం సదరు ఉద్యోగిపై పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నగదు దుర్వినియోగం జరిగిన తీరుపై, సేకరించిన మొత్తాన్ని ఎక్కడ వినియోగించారనే అంశాలపై విచారణ జరుపుతున్నారు.

Tags: