తెలంగాణ

పాడి రైతులకు అండగా ఉచిత పశువైద్య శిబిరం.. 62 పశువులకు గర్భధారణ పరీక్షలు

ఉచితంగా మందుల పంపిణీ.. పాడి పశువుల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధించాలి పరకాల తెలంగాణ గళం నవంబర్ 18 పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాడి రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ ఆధ…

By · · Updated

Share this article
పాడి రైతులకు అండగా ఉచిత పశువైద్య శిబిరం.. 62 పశువులకు గర్భధారణ పరీక్షలు

ఉచితంగా మందుల పంపిణీ.. పాడి పశువుల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధించాలి

పరకాల తెలంగాణ గళం నవంబర్ 18

పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాడి రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోబుధవారం పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు.

జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సనత్ కుమార్ పటేల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా పరకాల ఏడీ డాక్టర్ వెంకటేశం మాట్లాడుతూ.. విజయిరాంజీ పథకంలో భాగంగా రైతులు పశువుల పాకలు నిర్మించుకోవడంతో పాటు పచ్చిగడ్డి సాగు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

పశువైద్యాధికారి డాక్టర్ శ్రీరాం మాట్లాడుతూ.. రైతులు గోపాలమిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పశువులు ఎదకు వచ్చినప్పుడు లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయించడం ద్వారా మేలుజాతి ఆడదూడల ఉత్పత్తిని పెంచుకోవచ్చని వివరించారు. దూడలకు నట్టల నివారణ మందులు తప్పనిసరిగా వేయించాలని, పశుగ్రాసం సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాడి పశువుల పెంపకం ద్వారా పాల దిగుబడిని పెంచుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు.

ఈ శిబిరంలో మొత్తం 62 పశువులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు పశువులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్ వినయ్, డాక్టర్ విక్రమ్, సూపర్‌వైజర్ ప్రకాష్‌రెడ్డి, గోపాలమిత్రులు కుమార్, హన్మంతరావు, పశువైద్య సిబ్బంది లాల్‌సింగ్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Tags: