తెలంగాణ

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు నేరెళ్ల గ్రామస్తుల సన్మానం

పీఏసీఎస్ ఏర్పాటుకు కృషి చేసిన సర్పంచ్ కాసారపు బాలగౌడ్‌కు అభినందనలు తెలంగాణ గళం, జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): నేరెళ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఏర్పాటు క…

By · · Updated

Share this article

పీఏసీఎస్ ఏర్పాటుకు కృషి చేసిన సర్పంచ్ కాసారపు బాలగౌడ్‌కు అభినందనలు

తెలంగాణ గళం, జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):

నేరెళ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఏర్పాటు కావడంతో గ్రామ రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను గ్రామ సర్పంచ్ కాసారపు బాలగౌడ్, ఉపసర్పంచ్ కొమురయ్య, వార్డు సభ్యులు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు జుంజూరు అశోక్‌తో పాటు రైతులు, గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో గ్రామానికి పీఏసీఎస్ మంజూరైందని వారు పేర్కొన్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో రైతులకు ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు స్థానికంగానే పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.

గ్రామ రైతుల చిరకాల కోరికను నెరవేర్చేందుకు కృషి చేసిన సర్పంచ్ కాసారపు బాలగౌడ్‌కు రైతులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Tags: