ఎడ్యుకేషన్

మండల టాపర్ కు 10వేల నగదు అందజేత

కమలాపూర్, తెలంగాణ గళం: 2025 26 విద్యా సంవత్సరంలో కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల పదవ తరగతి బోర్డు ఎగ్జామ్ లో 549 మార్కులు సాధించిన విద్యార్థిని మొగిలిచర్ల అశ్వితకు పదివేల రూపాయల నగదు బహుమ…

By · · Updated

Share this article
మండల టాపర్ కు 10వేల నగదు అందజేత

కమలాపూర్, తెలంగాణ గళం:

2025 26 విద్యా సంవత్సరంలో కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల పదవ తరగతి బోర్డు ఎగ్జామ్ లో 549 మార్కులు సాధించిన విద్యార్థిని మొగిలిచర్ల అశ్వితకు పదివేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయల జి. రమేశ్ పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థి విద్యార్థుల సమక్షంలో శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఆర్ రాజేందర్ మరియు సిబ్బంది నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ యు పి పి టి రాష్ట్ర అధ్యక్షులు ఎండి అబ్దుల్లా, శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ జమ్మికుంట సీనియర్ మేనేజర్ జి శ్రీను, సీనియర్ డివో టి తిరుపతి రెడ్డి, శ్రీరామ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు అన్నపూర్ణ రజిత, శిరీష, శ్రావణి, రామ తదితరులు పాల్గొన్నారు.

Tags: