తెలంగాణ

ఇచ్చోడా ప్రధాన రహదారి పెండింగ్ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి.

ఆదిలాబాద్ జిల్లా,ఇచ్చోడా, నవంబర్ 19,తెలంగాణా గళం  _ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ మరియు మిగిలిన లింక్ రోడ్ల నిర్మాణ…

By · · Updated

Share this article

ఆదిలాబాద్ జిల్లా,ఇచ్చోడా, నవంబర్ 19,తెలంగాణా గళం 

_ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ మరియు మిగిలిన లింక్ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని గౌరవ బోత్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ గారు R&B అధికారులను ఆదేశించారు.ఈ రోజు ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని ఎమ్మెల్యే గారు స్వయంగా పరిశీలించి, పెండింగ్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గతంలో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సమయంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చోడా ప్రధాన రహదారి అభివృద్ధి కోసం రూ.13 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తన హయాంలో చేపట్టిన మొట్టమొదటి రహదారి అభివృద్ధి పనులుగా ఇచ్చోడా ప్రధాన రహదారి పనులను ప్రారంభించి, ఇప్పటికే సుమారు 50 శాతం పనులు పూర్తి చేయించినట్లు తెలిపారు.మిగిలిన రహదారి పనులతో పాటు డ్రైనేజీ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, లింక్ రోడ్లు మరియు సీసీ రోడ్ల పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి ఇచ్చోడా పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో R&B ఈఈ, ఇచ్చోడా మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, సంబంధిత అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు._

Tags: