అవునూరి శ్రీధర్‌కు ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్ష బాధ్యతలు
తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మండల ఉపసర్పంచుల సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు జంపన్న జానీ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు ముత్యాల స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు గురిజాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.
నూతన కమిటీ వివరాలు:
మండల అధ్యక్షుడిగా అవునూరి శ్రీధర్, ఉపాధ్యక్షులుగా గంగాధర్, అశోక్, తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా జక్కుల తిరుపతి, కోశాధికారిగా ఇనగంటి తిరుపతి, కార్యదర్శిగా సంగెం రజిత ఎన్నికయ్యారు.
అనంతరం ఎంపీడీవో, ఎంపీవో అధికారులను కలిసి ఉపసర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ నెల 27న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న ఉపసర్పంచుల మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపసర్పంచులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


