తెలంగాణ

ఎంపీ బలరాం నాయక్ క్షమాపణ చెప్పాలి - బీజేపీ డిమాండ్

పరకాల, తెలంగాణ గళం నవంబర్ 17: మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ డిమాండ్ చేశా…

By · · Updated

Share this article
ఎంపీ బలరాం నాయక్ క్షమాపణ చెప్పాలి - బీజేపీ డిమాండ్

పరకాల, తెలంగాణ గళం నవంబర్ 17:

మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు.

చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు" అనే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ పరకాల పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు.

మహిళలను గౌరవించాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి, మహిళల వైవాహిక జీవితాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం, అభ్యంతరకరమన్నారు.

మహిళల సంక్షేమం పేరుతో రాజకీయాలు చేస్తూ, అదే మహిళల గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

 ఎంపీ బలరాం నాయక్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళా లోకానికి బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.

Tags: