తెలంగాణ

దళారుల బారిన పడకుండా సీసీఐలోనే విక్రయించండి – ఎమ్మెల్యే రేవూరి*

*పత్తి రైతులకు మద్దతు ధరే లక్ష్యం..*      *పరకాల తెలంగాణ గళం నవంబర్ 19*  రైతులు పండించిన పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర లభించేలా సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప…

By · · Updated

Share this article
దళారుల బారిన పడకుండా సీసీఐలోనే విక్రయించండి – ఎమ్మెల్యే రేవూరి*

*పత్తి రైతులకు మద్దతు ధరే లక్ష్యం..* 

 

 

*పరకాల తెలంగాణ గళం నవంబర్ 19* 

రైతులు పండించిన పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర లభించేలా సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.

 

గురువారం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తాము పండించిన పత్తిని దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సీసీఐ కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు.

 

 రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పత్తి పంటకు గిట్టుబాటు ధర పొందాలని కోరారు.

Tags: