అర్హులందరూ బీమా పథకంలో నమోదు చేసుకోవాలి
తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ) :
పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని భీమ్రాజుపల్లి గ్రామంలో సర్పంచ్ కొలగాని శ్రీలత గంగాచారి, ఉపసర్పంచ్ బొమ్మన రాజమ్మ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 30లోపు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆధార్ వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మెన కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


