తెలంగాణ

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన ఏసీఎస్ రాజు

రాహుల్ గాంధీ, ఇటలీ నేత వ్యాఖ్యలను ఖండించిన భారత్ సురక్ష సమితి దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు తగవు: ఏసీఎస్ రాజు తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): హైదరాబాద్ వేద…

By · · Updated

Share this article

రాహుల్ గాంధీ, ఇటలీ నేత వ్యాఖ్యలను ఖండించిన భారత్ సురక్ష సమితి

దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు తగవు: ఏసీఎస్ రాజు

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):

హైదరాబాద్ వేదికగా నిర్వహించిన భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇటలీ నేత ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలను భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు తీవ్రంగా ఖండించారు.

విద్యానగర్‌లోని తమ కార్యాలయంలో నాయకులు అక్కినపల్లి కాశీనాథం, చిట్ల గంగాధర్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమైందని, రాజకీయ సంక్షోభం నెలకొందని రాహుల్ గాంధీ విదేశీ ప్రతినిధుల సమక్షంలో వ్యాఖ్యానించడం దేశ ప్రతిష్ఠను ప్రపంచం ముందు దిగజార్చడమేనని అన్నారు. ప్రపంచ దేశాలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తుంటే, ఆయనను ఫాసిస్ట్‌గా అభివర్ణించడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు.

అదేవిధంగా కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చిన ఇటలీ నేత ఫిలిబెక్ భారత రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడటం దేశ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడమేనని అన్నారు. విదేశీ ప్రతినిధులు భారత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని, వీసా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, నాయకులు సింగం గంగాధర్, వేముల దేవరాజం, వేముల పోచమల్లు, నరేందుల శ్రీనివాస్, ఎడమల వెంకట్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ వీరన్న, బొందుకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: