తెలంగాణ

బజార్ హత్నూర్ ఏజెన్సీలో గిరిజనేతర రైతుల భూ బదలాయింపు సమస్య - ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి వినతి

బజార్ హత్నూర్, నవంబర్ 21,తెలంగాణ గళం బజార్ హత్నూర్ మండల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులు భూ బదలాయింపు సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మండల రైతులు తెలంగా…

By · · Updated

Share this article

బజార్ హత్నూర్, నవంబర్ 21,తెలంగాణ గళం

బజార్ హత్నూర్ మండల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులు భూ బదలాయింపు సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మండల రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.
తరతరాలుగా తాతముత్తాతల కాలం నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లో భూ బదలాయింపుకు అవకాశం ఉండటంతో చట్టపరమైన నిబంధనల ప్రకారం తమ భూములను బదలాయించుకునేవారమని పేర్కొన్నారు.
కానీ ప్రస్తుత ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను అమల్లోకి తీసుకువచ్చిన తరువాత ఏజెన్సీ ప్రాంత గిరిజనేతర రైతులకు భూ బదలాయింపు చేసుకునే అవకాశం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు భూములకు సంబంధించిన లావాదేవీలు, భూ బదలాయింపులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీంతో ఆర్థికంగా, సామాజికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని వినతి పత్రంలో పేర్కొన్నారు.కావున బజార్ హత్నూర్ మండల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతుల భూ బదలాయింపు సమస్యను ప్రత్యేకంగా పరిశీలించి, గతంలో ధరణి పోర్టల్‌లో ఉన్న విధంగా భూ భారతి పోర్టల్‌లో కూడా సంబంధిత నిబంధనలకు అనుగుణంగా భూ బదలాయింపులు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.ఈ సమస్యను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, తమ ప్రాంత రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.

Tags: