తెలంగాణ

అంబేద్కర్ ఫంక్షన్ హాల్‌కు నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి అడ్లూరి

ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సహకరిస్తా.. మంత్రి అడ్లూరి జేరిపోతుల నరేష్ వినతికి స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): ధర్మపురి నియోజ…

By · · Updated

Share this article

ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సహకరిస్తా.. మంత్రి అడ్లూరి

జేరిపోతుల నరేష్ వినతికి స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్): ధర్మపురి నియోజకవర్గంలోని అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షుడు జేరిపోతుల నరేష్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి సంఘం సభ్యులను ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేద్కర్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని కోరుతూ సంఘం సభ్యులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను త్వరలో విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags: