తెలంగాణ

అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆధ్వర్యంలో 40వ వార్డులో హరితహారం మొక్కల పంపిణీ

పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత: అడువాల జ్యోతి లక్ష్మణ్ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి: అడువాల జ్యోతి తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్) :  పర్యావరణ పరిరక…

By · · Updated

Share this article

పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత: అడువాల జ్యోతి లక్ష్మణ్

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి: అడువాల జ్యోతి

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్) : 

పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని 40వ వార్డు ప్రజలకు తన నివాసంలో హరితహారం మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పుట్టినరోజులు, శుభకార్యాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో కనీసం ఒక మొక్క నాటాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ చెట్లుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు.

పచ్చదనం పెరిగితేనే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో 40వ వార్డుకు చెందిన పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Tags: