తెలంగాణ

5116 కార్తిక దీపాల వెలుగుల్లో మల్లక్కపేట భక్తాంజనేయ ఆలయం.. వైభవంగా పౌర్ణమి వేడుకలు

పరకాల తెలంగాణ గళం నవంబర్ 24 పట్టణంలోని మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ దేవస్థానంలో కార్తిక పౌర్ణమి, మంగళవారం పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్…

By · · Updated

Share this article
5116 కార్తిక దీపాల వెలుగుల్లో మల్లక్కపేట భక్తాంజనేయ ఆలయం.. వైభవంగా పౌర్ణమి వేడుకలు

పరకాల తెలంగాణ గళం నవంబర్ 24

పట్టణంలోని మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ దేవస్థానంలో కార్తిక పౌర్ణమి, మంగళవారం పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని 5116 కార్తిక దీపాలతో అలంకరించడంతో భక్తాంజనేయ స్వామి ఆలయం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

ఉదయం నుంచే పరకాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

ఉదయం 10 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఆలయ పూజారులు కాటూరి జగన్నాథచార్యులు, శరత్ చంద్రచారి, రాఘవచారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, అర్చనలు నిర్వహించారు. సామూహిక వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

5116 దీపాలతో ఆలయానికి ప్రత్యేక శోభ

కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 5116 దీపాలను వెలిగించి ప్రత్యేకంగా అలంకరించారు. వేలాది దీపాల వెలుగులతో ఆలయం కనువిందు చేస్తుండగా, ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. కార్తిక మాసంలో దీపారాధన చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని, స్వామివారి కృపతో సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

ఈ వేడుకల్లో దాదాపు పది వేల మంది భక్తులు పాల్గొంటున్నట్లు పూజారులు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో క్యూ లైన్లు, తాగునీరు, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించారు.

Tags: